వేసవికాలం సెలవులు కావడంతో తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండగా రోజురోజుకి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం నాడు 65 వేల మందిపైగా స్వామివారిని దర్శించుకోగా, అందులో 36 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. గురువారం నాడు హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం టిటిడికి లభించింది. స్వామివారి దర్శనానికి సర్వ దర్శనం టోకెన్లు తీసుకున్న వారికి 20 గంటలకు పైన సమయం పడుతుంది. దీంతో భక్తులు అసౌకర్యం గురి కాకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయి మూడు కిలోమీటర్ల మేర బారులు తీరారు. టీటీడీ భక్తులకు మంచినీరు, పాలు, అల్పాహారం లాంటి వాటిని అందిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎలాంటి సిఫారసు లేకలను కూడా స్వీకరించబోమని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రూల్స్ తక్షణం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 30వ తేదీ వరకు ఈ రూల్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కేవలం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారాల్లో మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం అందుబాటులో ఉండనుంది. కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలంటూ అధికారులు తెలిపారు.
0 Comments