Ad Code

నోకియా ఫోన్లు శకం ముగిసిందా ?


స్మార్ట్ ఫోన్లు రాకముందు మొబైల్ మార్కెట్లో నోకియా హవా కొనసాగేది. నోకియా 1100, 1110, 2690, ఎక్స్ ప్రెస్ మ్యూజిక్ వంటి ఫోన్లు మార్కెట్ ను ఏలాయి. కాలానికి తగ్గట్లు అప్డేట్ అవ్వకపోతే ఎంత పెద్ద దిగ్గజం అయినా వెనకబడాల్సిందే, కనుమరుగవ్వాల్సిందే. ఇప్పుడు నోకియాకు అదే పరిస్థితి వచ్చింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్ లో పనిచేసే నోకియా స్మార్ట్ ఫోన్లను విక్రయించేంది. నోకియా లూమియా సిరీస్ మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన ఫేమస్ స్మార్ట్ ఫోన్ సిరీస్. కానీ తరువాత మైక్రోసాఫ్ట్ నోకియా బ్రాండ్ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్ కు విక్రయించింది. అప్పటి నుండి హెచ్ఎండీ, నోకియా కోసం స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంది. భవిష్యత్తులో కూడా నోకియా స్మార్ట్ ఫోన్ల తయారీ కొనసాగుతుందని హెచ్ఎండీ తెలిపింది కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. తన ఒరిజినల్ బ్రాండ్ హెచ్ఎండీకి గుర్తింపును ఇవ్వాలనుకుంటున్నారు. కొంత కాలంగా హెచ్ఎండీ గ్లోబల్ నిరంతరం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, దీని కారణంగా నోకియా స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. హెచ్ఎండీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ / ట్విట్టర్ నుంచి నోకియా బ్రాండ్ ను కూడా తొలగించింది. హెచ్ఎండీ కూడా కొంతకాలంగా దాని బ్రాండింగ్ ను నిరంతరం టీజ్ చేస్తూనే ఉంది. ఇంతకుముందు ఈ బ్రాండ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నోకియా.కామ్ అని ఉంది. కానీ ఇప్పుడు దాన్ని హెచ్ఎండీ.కామ్ అని మార్చారు. అటువంటి పరిస్థితిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా స్థానంలో హెచ్ఎండీ తన స్వంత బ్రాండింగ్ తో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu