Ad Code

20 నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలు !


భారతదేశంలోని 20 నగరాల్లో సేమ్ డే డెలివరీ సేవలను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అంటే భారతదేశంలోని 20 నగరాల్లో ఫ్లిప్ కార్ట్ నుంచి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే, అదే రోజు వినియోగదారుడి ఇంటికి డెలివరీ అవుతుంది. ఈ సేవ వినియోగదారులకు సచాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఈ-కామర్స్ యాప్ ల  డెలివరీ ఆలస్యంగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లేట్గా రావడం వల్ల ఆర్డర్ చేసిన తర్వాత కూడా చాలా సార్లు దాన్ని రిటర్న్ కూడా చేస్తారు. అమెజాన్ తన ప్రైమ్ వినియోగదారులకు నెక్స్ట్ డే డెలివరీని, అనేక ఉత్పత్తులపై సాధారణ వినియోగదారులకు సేమ్ డే డెలివరీని కూడా అందిస్తుంది. అమెజాన్ మాత్రమే కాకుండా మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర షాపింగ్ యాప్ల నుంచి షాపింగ్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు వినియోగదారులు ఆర్డర్ చేసిన రోజున వస్తువులు వారి ఇళ్లకు చేరుకుంటాయి. కానీ దీనికి ఎటువంటి హామీ లేదు. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా సేమ్ డే డెలివరీ సేవను ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu