దేశీయ మార్కెట్లో వివో వై200 ఫోన్ విడుదల చేసింది. 8జీబీ ర్యామ్‌తోపాటు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ర్యామ్ కెపాసిటీని వర్చువల్‌గా పెంచుకోవచ్చు. జంగిల్ గ్రీన్, డజర్ట్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. దేశీయ మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం34, రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్లకు వివో వై200 ఫోన్ గట్టి పోటీ ఇవ్వనున్నది. వివో అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో వివో వై200 ఫోన్ లభిస్తుంది. వివో 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు లభిస్తుంది. ఎస్బీఐ బ్యాంకుతోపాటు ఇండస్ఇండ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ కార్డులతోపాటు వివో వై200 ఫోన్ చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నారు. 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐ అవకాశం కల్పిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1,080×2,400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) , 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ లెన్స్ కెమెరా వస్తుంది. నైట్ మోడ్, పనోరమ, టైం ల్యాప్స్ వీడియో, డ్యూయల్ వ్యూ, స్లోమోషన్ తదితర మోడ్‌లకు కెమెరా సెటప్ సపోర్ట్‌గా ఉంటుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ 2.0 సెన్సర్, యాక్సెలర్ మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్ కనెక్టివిటీ కలిగి ఉంటది. దీంతోపాటు బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
0 Comments