వాహనం కొనుగోలు చేయడంతోపాటు మంచి వాహన బీమా పాలసీని కూడా తీసుకోవడం అవసరం. అనుకోని ప్రమాదాల నుంచి పాలసీలు రక్షణ కల్పిస్తాయి. ఏదైనా ప్రమాదంలో కారు బాగా దెబ్బతింటే, బాగు చేయించుకొనేందుకు ఆర్థిక బారాన్ని మోయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ పాలసీలు రక్షణ అందిస్తాయి. కారు వినియోగించే వారు ఏటా భరించాల్సిన తప్పనిసరి ఖర్చులలో కార్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని వాహన బీమా పాలసీలు కారును కొనుగోలు చేసే సమయంలోనే విక్రయిస్తారు. చాలా కొద్ది మంది పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ లను మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైనా పాలసీ రెన్యువల్ కోసం చూస్తున్నట్లయితే, ఏ ప్రత్యామ్నాయాలు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఉన్న ప్రయోజనాలు, నష్టాలను కూడా తెలుసుకోవాలి. వాహన బీమా ప్రొవైడర్‌ను మార్చాలని నిర్ణయం తీసుకోవడానికి ఇతర కారణాలు ఉండవచ్చు. మెరుగైన కవరేజ్, ప్రయోజనాలను అందించే ప్రత్యామ్నాయ బీమా పాలసీల గురించి తెలిస్తే.. బీమా ప్రొవైడర్‌ను మార్చాలని భావిస్తారు. అదే విధంగా లొకేషన్‌లో మార్పు, తర్వాత ప్రీమియం రేట్లను మార్చడం కూడా బీమా ప్రొవైడర్‌ని మార్చడానికి కారణాలు కావచ్చు. లిమిటెడ్ ఇన్-నెట్‌వర్క్ గ్యారేజీలు, పేలవమైన కస్టమర్ సర్వీస్ కారణంగా ప్రస్తుత ప్రొవైడర్‌తో అసంతృప్తి చెంది కూడా పాలసీ ప్రొవైడర్‌ను మార్చాలని అనుకోవచ్చు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని మార్చినప్పుడు, మరిన్ని ప్రయోజనాలు, కవరేజీని అందించే కొత్త పాలసీని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పాలసీ అందిస్తున్న అన్ని ప్రయోజనాలను తక్కువ ప్రీమియంకు అందించే సంస్థలు కూడా ఉండవచ్చు. క్యాన్సల్ ఛార్జీ లేనందున, ప్రొవైడర్‌ని మార్చేటప్పుడు జేబులోంచి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. టర్మ్ మధ్యలో ఇన్సూరెన్స్ రద్దు చేస్తే, చాలా మంది ప్రొవైడర్లు.. పాలసీదారులు చెల్లించిన ప్రీమియంను ప్రో-రేటా ప్రాతిపదికన కూడా వాపసు చేస్తారు. క్యాన్సల్ చేయడం గురించి ప్రస్తుత ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు 30 రోజుల ముందుగానే తెలియజేయాలి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లను మారిస్తే.. కొన్ని ఇన్సూరెన్స్ లాయల్టీ తగ్గింపులను కోల్పోవచ్చు. డిస్కౌంట్ ఆర్థిక ప్రయోజనాలు వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం తమ పాలసీలను రెన్యూవల్ చేసే కస్టమర్‌లకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ఈ తగ్గింపులను అందిస్తారు. వాహన బీమాపై మీ మునుపటి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందిస్తున్న ఏవైనా బండిల్ డిస్కౌంట్‌లు లేదా పాలసీలను కూడా కోల్పోతారు. మునుపటి, కొత్త పాలసీల మధ్య ఏదైనా ఇన్సూరెన్స్ గ్యాప్ భారీ జరిమానాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఇది అనవసరమైన ఆర్థిక ప్రమాదంలో పడేస్తుంది.
0 Comments