కొత్త ఎమ్‌పి3 రూ.3774లుగా

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ఎమ్‌ఓఎస్‌ (మినిస్ట్రీ ఆఫ్‌ సౌండ్‌) కొత్త ఎమ్‌పి3 మోడల్‌ను విడుదల చేసింది. దీంట్లో 1జిబి, 2జిబి అనే రెండు రకాల్లో ఇవి లభిస్తాయని సంస్థ తెలుపుతోంది. వీటికి ఎమ్‌ఓఎస్‌ఎమ్‌పి085 ప్లేయర్‌ అని పేరుతో వ్యవహరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ఉన్నటువంటి ఫీచర్లకు అదనంగా టిఎఫ్‌టి స్క్రీన్‌ డిస్‌ప్లే కలిగి ఉన్నట్లు తెలిపింది. దీని ద్వారా పాటలను మరింత స్పష్టంగా విని ఆస్వాదించవచ్చునని సంస్థ వెల్లడిస్తోంది. వీటి ధరను వెల్లడిస్తూ 1జిబి రూ.3774లుగా, 2జిబి రూ.4103లుగా ప్రకటించింది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.