Ad Code

ఇంటర్నెట్‌ సెక్యూరిటీ ఏఓఎల్‌ సెంట్రల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది

ప్రముఖ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ ఏఓఎల్‌ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సెంట్రల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఇంటర్నెట్‌ను వినియోగించే వినియోగదారులు భద్రతా ఏర్పాట్లును మరితం పటిష్టపరుచుకోవచ్చునని సంస్థ తెలుపుతోంది. దీనికి ప్రముఖ యాంటీ వైరస్‌, ఇంటర్నెట్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే మెకెఫీ వైరస్‌స్కాన్‌ ప్లస్‌ అనే ప్రత్యేకమైన సెక్యూరిటీ టూల్‌ను సైతం అందిస్తోంది. ఈ వైరస్‌ స్కాన్‌ ప్లస్‌తో ఇంటర్నెట్‌ ద్వారా కంప్యూటర్‌లోకి తెలియకుండా చొరబడిన స్పామ్స్‌, బగ్గ్స్‌, వైరస్‌లను ఇది కనిపెట్టగలుగుతుందని రెండు సంస్థలూ తెలుపుతున్నాయి. దీని ద్వారా భారతలోని తమ వినియోగదారులకేగాక, ఇతరులకు సైతం ఈ సర్వీస్‌ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని ఏఓఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీవ్‌ మర్ఫీ అంటున్నారు. ఈ సర్వీస్‌ టూల్స్‌ను కావాలనుకునే వారు http://daol.aol.com/security సైట్‌ నుంచి కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి కావల్సిన సమాచారాన్ని పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu