Ad Code

డిజిటల్‌ మాల్యిక్యులర్‌ పరికరం క్షణాల్లో రోగాన్ని..

పస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎయిడ్స్‌ రోగ నిర్థారణ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఆఫ్రికా దేశాల్లో ఉంది. అయితే, సరికొత్తగా ప్రవేశపెట్టిన పరిజ్ఞానం ద్వారా అయితే, ఎయిడ్స్‌ వ్యాధి నిర్థారణ చాలా స్వల్ప ఖర్చుతోనే నిర్థారించవచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకమైన డిజిటల్‌ మాల్యిక్యులర్‌ పరికరాన్ని ప్రవేశపెట్టారు. దీని సాయంతో రోగి రక్తంను ఈ డిజిటల్‌ మాల్యిక్యులర్‌ పరికరం క్షణాల్లో రోగాన్ని నిర్థారిస్తుందని వెల్లడించారు. ప్రత్యేకించి ఈ పరికరం సాయంతో టి-సెల్స్‌ను లెక్కించటం ద్వారా వ్యక్తికి హెచ్‌ఐవి సోకిందో, లేదో సులభంగా తెల్సిపోతుందని వెల్లడిస్తున్నారు. ఎందువల్ల అనగా, టి-సెల్స్‌ను లెక్కించటం ద్వారా హెచ్‌ఐవి వైరస్‌ మనిషి శరీరంలోకి చేరిందో, లేదో సులభంగా తెల్సిపోతుందని తెలుపుతున్నారు. ఇది అతిచిన్న మైక్రోచిప్‌ ఆధారంగా పనిచేస్తుందని దీనివల్ల తప్పులు జరగదని, అమెరికాలోని మెసాచ్యూట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu