Ad Code

అయోధ్య రామమందిర ట్రస్టులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు ఏర్పాటు : ముగ్గురు కొత్త సభ్యులు నియామకం

యోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ముఖ్య సమావేశంలో పాలకవర్గానికి ముగ్గురు కొత్త సభ్యులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆలయ నిర్వహణతో పాటు ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ట్రస్టు చరిత్రలో తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ దైనందిన కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి అందుబాటులోకి రానున్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లోకి మహేశ్ భగచంద్కా, మదన్ మోహన్ పాండే, నిర్మలా యాదవ్ లను కొత్త సభ్యులను ట్రస్టు బోర్డులోకి తీసుకున్నారు. గతంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం, మరొక సభ్యుడు విమలేంద్ర మోహన్ మిశ్రా హఠాన్మరణం చెందడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆలయ విరాళాల నిర్వహణపై కొన్ని వివాదాలు రావడం, ఆరోపణలు వెల్లువెత్తడంతో పరిపాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu