Ad Code

కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన కంటైనర్‌ డ్రైవర్‌ : ఇన్నోవా డ్రైవర్ పైనుంచి కంటైనర్‌ వెళ్లడంతో మృతి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో  కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన కంటైనర్‌ను అడ్డుకుని ప్రశ్నించిన ఇన్నోవా డ్రైవర్‌పై కంటైనర్‌ నడిపించడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన నగరి సమీపంలోని వీకేఆర్ పురం వద్ద నిన్న రాత్రి చోటుచేసుకోగా,ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి మారుతీనగర్‌కు చెందిన నారాయణ (36) ఇన్నోవా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంటైనర్‌ తన కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లడంతో నారాయణ దాన్ని వెంబడించి వీకేఆర్ పురం వద్ద అడ్డుకున్నాడు. కంటైనర్‌ డ్రైవర్‌ను ప్రశ్నించేందుకు వాహనంలోకి ఎక్కే ప్రయత్నం చేయగా నారాయణ కిందపడిపోయాడు. అదే సమయంలో కంటైనర్‌ అతడిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నగరి సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని తిరుపతి మారుతీనగర్‌కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు.కంటైనర్‌ మహారాష్ట్రకు చెందినదిగా గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu