ఒకప్పుడు క్రికెట్ రారాజుగా వెలుగొందిన వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయింది. దారుణమైన ప్రదర్శనతో పాతాళానికి పడిపోయింది. గత వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కూడా వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించకపోగా, క్వాలిఫయర్స్‌లోనూ పసికూన జట్లతో ఓడి టోర్నీకి దూరమైంది. ఈ సారి కూడా వెస్టిండీస్ అదే పరిస్థితి ఎదుర్కొంటుంది. సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. దాంతో వెస్టిండీస్ ఆశలు ఆవిరయ్యాయి. వన్డే ర్యాంకింగ్స్ ద్వారా నేరుగా టోర్నీకి అర్హత సాధించడానికి ఐసీసీ ఈ సెప్టెంబర్ 30 వరకు డెడ్‌లైన్ విధించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న దేశాలు నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లతో పాటు ఆతిథ్య దేశాలుగా ఉన్న సౌతాఫ్రికా, జింబాబ్వే కూడా క్వాలిఫై అవుతాయి. 8వ స్థానంతో ఆప్ఘన్ నేరుగా క్వాలిఫై అయ్యింది. ప్రస్తుతం వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న కరేబియన్ టీమ్.. కటాఫ్ తేదీ నాటికి రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆ రెండూ సెప్టెంబర్‌లో భారత్‌తోనే జరగనున్నాయి. ఆ రెండింటిలో గెలిచినా వెస్టిండీస్ టాప్-8లో నిలవదు. ఆ జట్టు ప్రపంచకప్‌లో ఆడాలంటే ఫిబ్రవరి 2027లో నిర్వహించే క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. లేదంటే వరుసగా రెండోసారి ప్రపంచకప్‌నకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 46.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. అనంతరం అఫ్గానిస్థాన్ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసి గెలుపొందింది. ఈ విజయంతో వన్డే ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం అందుకున్న ఆప్ఘనిస్థాన్.. వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది.
Home
2027 ODI World Cup
Afghanistan Qualifies Directly for World Cup
cricket
failing to qualify directly and subsequently losing to underdog teams
sports
West Indies Fails to Qualify
వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్ : అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।
