విశాఖపట్నం - బెంగళూరు మార్గంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును నడిపేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు వెల్లడించారు. దసరా పండుగ నాటికి ఈ ప్రీమియం లగ్జరీ రైలును పట్టాలెక్కించేందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లే సాధారణ రైళ్లలో ప్రయాణానికి దాదాపు 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఈ కొత్త స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 14 గంటల వ్యవధిలోనే ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ రైలు వారానికి 6 రోజులు (సోమవారం మినహా) నడిచేలా ప్రతిపాదించారు: విశాఖపట్నం నుంచి రాత్రి 08:15 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరుకు ఉదయం 10:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. బెంగళూరు నుంచి రాత్రి 08:00 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం ఉదయం 10:00 గంటలకు చేరుకుంటుంది.
0 Comments