శ్రావణ మాసం ప్రభావంతో డిమాండ్ తగ్గడం వల్ల చికెన్ ధరలు పడిపోయాయి. గత నెలలో కిలో చికెన్ ధర ఏకంగా రూ.340 నుంచి రూ.350 వరకు పలికింది. కానీ ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల మార్కెట్లో సరఫరా ఎక్కువగా ఉండి, డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా వ్యాపారులు ధరలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల చికెన్ షాపులకు కస్టమర్లు తగ్గి, వ్యాపారం మందగించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.222, డ్రస్స్‌డ్ చికెన్ రూ.197, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.100, రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉంది. విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.240, డ్రస్స్‌డ్ చికెన్ రూ.212, ఫారం లైవ్ బర్డ్ రూ.110, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137 వద్ద కొనసాగుతోంది. చికెన్ ధరలతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా కొంతవరకు తగ్గాముఖం పట్టాయి. గత నెలలో ఒక్కో గుడ్డు రూ.8 వరకు పలకగా, ప్రస్తుతం ధర తగ్గి డజను గుడ్ల రిటైల్ ధర విజయవాడలో రూ.75గా, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో రూ.74గా ఉంది. అంటే ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.6 చొప్పున లభిస్తోంది.
0 Comments