Ad Code

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసు : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ రవాణా టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఈడీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసింది. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించిన అధికారులు.. ఆ తర్వాత కారుమూరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి లిక్కర్ వ్యాపారుల నుంచి ఏకంగా రూ.28 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు లిక్కర్ రవాణా చేసే సబ్-కాంట్రాక్టులను సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారని దర్యాప్తులో తేలింది. బదిలీ ఈ కుంభకోణం ద్వారా వచ్చిన కోట్ల రూపాయల ముడుపులను హవాలా మార్గంలో దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ముడుపుల రూపంలో వచ్చిన సొమ్మును సునీల్ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు సీఐడీ  ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైంది. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu