గూగుల్ కంపెనీ ఆధునాతన ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ ఫోన్లను మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఫోన్ మార్కెట్లోకి అమ్మకానికి కూడా వచ్చింది. ఇప్పుడు కొత్త వేరియంట్ మొబైల్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ ను విడుదల చేసిన టైం లో ర్యామ్ సైజ్ కేవలం 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో మాత్రమే తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వేరియంట్ ఫోన్‌ను లాంచ్ చేసింది గూగుల్. 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రీసెంట్‌గా లాంచ్ చేసింది గూగుల్… ధరల విషయానికొస్తే.. ధర రూ. 1,06,999గా ప్రకటించింది. బే, ఒబ్సిడియాన్, పోర్సెలియాన్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,13,999గా నిర్ణయించారు. 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెషర్ రేట్‌తో కూడిన ఈ ఫోన్ స్క్రీన్ 1344 x 2992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ గూగుల్ టెన్సోర్ జీ3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు..ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 30 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.
0 Comments