డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన అన్ని రకాల మిస్సెల్ టెక్నాలజీని భారతీయ రక్షణ ఉత్పత్తి సంస్థలకు బదిలీ చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, దేశీయంగా క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, సాంకేతిక బదిలీతో భారతీయ ప్రైవేట్, ప్రభుత్వ రక్షణ ఉత్పత్తి సంస్థలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు డీఆర్‌డీవో క్షిపణి వ్యవస్థల తయారీలో భాగస్వామ్యం కానున్నాయి. రీసెర్చ్ స్టేజీలో ఉన్న మిస్సైల్ టెక్నాలజీలను పారిశ్రామిక స్థాయి ప్రతిపత్తికి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతీయ భద్రతా సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో, భారత సైన్యానికి అవసరమైన క్షిపణి ఆయుధ సంపత్తిని స్వదేశంలోనే త్వరితగతిన భారీగా ఉత్పత్తి చేసేందుకు ఈ చర్య ఎంతగానో దోహదపడనుంది కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.
0 Comments