ఆంధ్రప్రదేశ్ లోని కడప రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు రక్తదాన చేసి వినూత్న నిరసన తెలియజేశారు. 25% స్టైఫండ్ పెంచే వరకు సమ్మె ఆగదని జూనియర్ డాక్టర్ల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు 3 పర్సెంట్ 5 పర్సెంట్ స్టైఫండ్ పెంచుతామని ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగిందని దానికి జూనియర్ డాక్టర్లు ఎటువంటి పరిస్థితులకు ఒప్పుకుంటే పరిస్థితి లేదన్నారు. తాము డిమాండ్ చేస్తున్న విధంగా 20%, 25% పెంచాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె ఆగదని జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
0 Comments