Ad Code

సినిమా షూటింగ్ లకు ఉచితంగా అనుమతులు : మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే షూటింగులకు ఉచితంగా అనుమతులు మంజూరు చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడివుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సినిమా షూటింగులకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. డబ్బింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తరహాలోనే విజయవాడను కూడా సినీ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని సహజ సిద్ధమైన లొకేషన్లను చిత్ర పరిశ్రమ మరింతగా వినియోగించుకోవాలని ఆయన కోరారు

Post a Comment

0 Comments

Close Menu