Ad Code

భార్య, సోదరిని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న ఎస్‌బీఐ ఉద్యోగి : 'నా భార్య నన్ను మోసం చేసింది, అందుకే చంపేసా' వాట్సాప్‌ స్టేటస్‌

త్తరప్రదేశ్‌లోని లక్నో గోమతీ నగర్ ప్రాంతంలో ఒక బ్యాంకు ఉద్యోగి తన భార్యను, చెల్లిని కాల్చి చంపి, ఆపై తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ జంటల హత్య వెనుక అసలు రహస్యాన్ని అతను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టాడు. మృతుడు మానస్ వాజ్‌పేయ్ ఎస్‌బీఐలో పనిచేసేవాడు. గోమతీ నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో భార్య దివ్య మిశ్రా రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె ఆటోరిక్షాలో వేచి ఉన్న సమయంలో భర్త పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరాయ్యాడు. ఆతరువాత గోమతి నగర్‌లో ఇంటికెళ్లి దివ్యాంగురాలైన తన సోదరి శివా వాజ్‌పేయ్‌నుని కాల్చి చంపాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పెట్టిన అనంతరం ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ''నా భార్య నన్ను మోసం చేసింది, అందుకే చంపేసా. ఇపుడు నా సోదరి, నేను కూడా చనిపోవాలి. ఈ విషయాలన్నీ ఆమె సోదరి ప్రజ్ఞ , భరత్‌కు అంతా తెలుసు'' అంటూ స్టేటస్‌ పెట్టాడు. అయితే తాను పోయిన తరువాత దివ్యాంగురాలైన తన సోదరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే కారణంతో అతను ఆమెను చంపినట్లు భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu