Ad Code

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ : స్పర్శ దర్శనంలో మార్పులు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించేలా ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్వరగతిన దర్శనం అయ్యేలా శని,అది, సోమవారాలలో స్పర్శ దర్శనాలలో మార్పులు చేశారు. ఈ మూడు రోజులు ఉదయం వేళలో మనమిత్ర వాట్సప్,ఆన్లైన్ లో స్పర్శ దర్శనం టికెట్స్ ముందస్తుగా పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ అలానే ప్రముఖులు సిఫార్సుపై రాత్రి వేళల్లో స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు అలానే ప్రముఖులు మాత్రం క్షేత్రానికి స్వయంగా వస్తేనే ఈ మూడు రోజులలో ఉదయం వేళలో స్పర్శ దర్శనం కల్పిస్తు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగతిన కల్పిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu