Ad Code

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గడల శ్రీనివాస్‌

నసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ నాయకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంపై స్పందించిన ఆయన.. తనపై నమ్మకంతో ఈ కీలకమైన బాధ్యతను అప్పగించిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా్ణ్‌కు డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. "పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజా సమస్యలపై జనసేన వైఖరిని ప్రజల్లోకి స్పష్టంగా, హుందాగా, బలంగా తీసుకెళ్లేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను" అని డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన గమ్యమని స్పష్టం చేస్తూ, "బాధ్యతలు మారవచ్చు.. కానీ నా లక్ష్యం ఒక్కటే, ప్రజలే ప్రథమం.. ప్రజాసేవే పరమావధి" అని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకొస్తూ పార్టీకి, ప్రజలకు మధ్య బలమైన వారధిలా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ సీనియర్ నాయకత్వానికి, అలాగే తనకు నిరంతరం అండగా నిలుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu