Ad Code

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జో బైడెన్ : ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్

మెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (83) తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుమారుడు హంటర్ బైడెన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతేడాది మే నెలలోనే జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగా, ప్రస్తుతం ఆ వ్యాధి శరీరంలోని ఇతర అవయవాలతో పాటు ఎముకలకు కూడా వేగంగా పాకిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన శారీరక వేదనను, నొప్పులను కలిగిస్తోందని చెబుతూ హంటర్ బైడెన్ తీవ్ర తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. క్యాన్సర్ తీవ్రత పెరగడం వల్ల జో బైడెన్ శరీరం రోజురోజుకూ బలహీనపడుతున్నప్పటికీ, ఆయన తన మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోలేదని హంటర్ స్పష్టం చేశారు. శారీరక విధివిధానాలు సహకరించకపోయినప్పటికీ, ఆయన ఇంకా వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తమ సమయాన్ని కేటాయిస్తున్నారని తెలిపారు. నిరంతరం దేశ భవిష్యత్తు మరియు ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచిస్తున్నారని, ఆయనలోని ప్రజాసేవ మరియు నిబద్ధత ఇప్పటికీ తగ్గలేదని గుర్తుచేసుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu