Ad Code

బీవైడీ సీలియాన్ 7 ఎస్యూవీ కొత్త డైనమిక్ వేరియంట్ విడుదల

దేశీయ మార్కెట్లో బీవైడీ సంస్థ సీలియాన్ 7 ఎస్యూవీకి కొత్త డైనమిక్ వేరియంట్ ను విడుదల చేసింది . ఇది ఇప్పటికే తన ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, స్మార్ట్ డిజైన్, అధిక రేంజ్ లతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ Dynamic వేరియంట్ తో BYD ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే విధంగా తీసుకువచ్చింది. ఈ SUVలో డ్రైవింగ్ అనుభవం కంపార్ట్ గా , స్మూత్‌గా ఉండేలా రూపొందించారు.భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని Dynamic వేరియంట్ ను వినియోగదారులకు కొత్త ఆప్షన్‌గా BYD అందిస్తుంది . ఈ వాహనం శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్, అధిక రేంజ్, వేగవంతమైన పెర్ఫార్మన్స్ , ఆధునిక టెక్నాలజీ , భద్రతా ప్రమాణాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 82.56 kWh BYD Blade Batteryతో ఇది శక్తివంతమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ (RWD) , ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో ఉన్న ఈ SUV 230 kW నుండి 390 kW వరకు పవర్‌ను టార్క్ 380 Nm నుండి 690 Nm వరకు టార్క్ ను ఉత్పత్తి చేస్తూ వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. 0-100 kmph వేగాన్ని AWD వెర్షన్‌లో కేవలం 4.5 సెకన్లలో అందుకుంటుంది . రేంజ్ పరంగా RWD వెర్షన్ 567 km వరకు, AWD వెర్షన్ 542 km వరకు ప్రయాణించగలదు. టాప్ స్పీడ్ 215 kmphగా ఉంటుంది. డిజైన్ పరంగా దీనిలో పానోరమిక్ గ్లాస్ రూఫ్, 15.6-ఇంచ్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్, NFC కార్డ్ కీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం నప్పా లెదర్ సీట్స్, DYNAUDIO 12 స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రతా పరంగా 11 ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. 4,830 mm పొడవు, 1,925 mm వెడల్పు, 1,620 mm ఎత్తు, 2,930 mm వీల్‌బేస్, 500 L రియర్ బూట్ స్పేస్, 58 L ఫ్రంట్ బూట్ స్పేస్ తో ఉంటుంది . రంగులలో Atlantis Gray, Tahiti Blue వంటి ప్రీమియం షేడ్స్ అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu