Ad Code

రూ.200 కోట్ల క్లబ్‌లోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్'

సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఆదరిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రతి ఎమోషన్‌ను వెండి తెరపై కుటుంబాలతో కలిసి సెలబ్రేట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. రూ.200 కోట్ల మార్క్‌ను దాటినప్పటికీ సినిమా జోరు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu