Ad Code

మండుతున్న కూరగాయల ధరలు

వేసవి కాలం ముగిసి వర్షాలు కురుస్తున్నా కూరగాయల ధరలు మాత్రం తగ్గడం లేదు. టమాటా మినహా మిగిలిన కూరగాయలు కిలో వంద రూపాయలకు చేరువయ్యాయి. ముఖ్యంగా క్యాప్సికం, చిక్కుళ్ల ధరలు సెంచరీ దాటడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ధరల భారం కారణంగా సామాన్య ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మార్కెట్‌లో క్యారెట్ ధర రూ.80 ఉండగా, బీట్‌రూట్, మిర్చి రూ.60 పలుకుతున్నాయి. అల్లం, వెల్లుల్లి ధరలు గతంలో రూ.150 లోపు ఉండేవి, ఇప్పుడు అవి రూ.220 వరకు పెరిగాయి. కూరగాయలతో పాటు దినుసుల ధరలు కూడా ఎగబాకడం ఇబ్బందిగా మారింది. రిటైల్ వ్యాపారుల అధిక లాభాల ఆశే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రజలు వాపోతున్నారు. 


Post a Comment

0 Comments

Close Menu