బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీని తగ్గించేందుకు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రతిపాదించిన రెండవ ఎయిర్‌పోర్టును నగర దక్షిణ భాగంలో నిర్మించనున్నట్లు డీకే శివకుమార్ బుధవారం ప్రకటించారు. భూమి ధర తక్కువ ఉన్న, సాంకేతికంగా అనుకూలమైన, మరీ ఎత్తుపల్లాలు లేని ప్రాంతాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క గ్రామాన్నీ తరలించకూడదని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కర్ణాటక సీఎం స్పష్టం చేశారు. కొన్ని ఇళ్లకు పరిహారం చెల్లించవచ్చని, కానీ మొత్తం గ్రామాన్ని ఖాళీ చేయించే పరిస్థితి రాకూడదని అధికారులకు సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.బీ. పాటిల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డీకే శివకుమార్ ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నిర్దిష్టమైన స్థలాన్ని ఖరారు చేయలేదని, కానీ మునుపటి ప్రతిపాదనలకు అనుగుణంగా దక్షిణ బెంగళూరులోనే ఎయిర్‌పోర్టు ఉంటుందని చెప్పారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే మూడు ప్రాంతాలను పరిశీలించారు. అందులో రెండు దక్షిణ బెంగళూరులోని కనకపుర రోడ్డులో (హారోహళ్లి సమీపంలో) ఉండగా, మరొకటి నగరానికి పశ్చిమాన నేలమంగళ వద్ద (కుణిగల్ రోడ్డు) ఉంది.
0 Comments