Ad Code

పిల్లల కోసం ఈవీ సైకిల్ ని విడుదల చేసిన టెస్లా

టెస్లా పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బ్యాలెన్స్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. సంస్థ మాత్రం చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఈవీ సైకిల్ విడుదల చేసింది. ఈ బ్యాలెన్స్ బైక్‌ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించారు. టెస్లా బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్, చైన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ వంటివి ఉండవు. కేవలం పిల్లలు తమ కాళ్లతో బైక్‌ను ముందుకు కదిలిస్తూ బ్యాలెన్స్, హ్యాండిల్ తిప్పడం నేర్చుకునేలా తయారు చేశారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది. ఇందులో మెగ్నీషియం అల్లాయ్ ఫ్రేమ్ ఉపయోగించడం వల్ల పిల్లలు సులభంగా నడపగలరు. బైక్‌పై టెస్లా లోగో, ముందు భాగంలో కంపెనీ గుర్తు కూడా ఉన్నాయి. ఈ బైక్ ధర 225 డాలర్లు. సాధారణ పిల్లల బ్యాలెన్స్ బైక్‌లతో పోలిస్తే దీని ధర కొంత ఎక్కువే. అయితే ప్రీమియం బ్రాండ్ల బైక్‌లతో పోలిస్తే.. టెస్లా ధర కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్‌ సీటు ఎత్తును పిల్లల పెరుగుదలకు అనుగుణంగా ఐదు రకాలుగా మార్చుకునే సౌకర్యం ఉంది. గరిష్టంగా 35 కిలోల బరువు ఉన్న పిల్లలు దీనిని ఉపయోగించవచ్చు. బైక్‌ను అసెంబుల్ చేసుకోవడానికి అవసరమైన టూల్స్ కూడా ప్యాకేజీలో అందిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu