ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో డబ్బు వివాదం, పాత కక్షల కారణంగా అల్లుడు మామను హత్య చేశాడు. మృతుడు శంకర్ నారాయణరెడ్డి గతంలో తన అల్లుడికి రూ. 10 లక్షల రూపాయలలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఎంతకాలమైనా అల్లుడు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలేదు. దీనికి తోడు అల్లుడు కూతురిని తీవ్రంగా వేధిస్తుండటంతో శంకర్ నారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురరై అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు పెట్టించి అవమానించిన మామ శంకర్ నారాయణరెడ్డిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన వద్ద పనిచేసే ఒక వ్యక్తిని తోడుగా తీసుకుని, మామపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపరచడంతో శంకర్ నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోవర్ధన్ మద్యం తాగి గొడవపడి కొట్టడంతోనే తన మామ చనిపోయారని పోలీసులకు నమ్మబలికాడు. గన్నెవారిపల్లి కాలనీలోని మరో ఇంట్లో ఉంటున్న పెద్ద కుమార్తె నవిత తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిజం బయటపడింది. పోలీసులు నిందితులు సత్యనారాయణ, గోవర్ధన ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
0 Comments