Ad Code

వేగంగా దూసుకొచ్చి ట్రక్కును ఢీకొట్టిన కారు : ఐదుగురు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం

ధ్యప్రదేశ్‌లోని మైహార్‌ జిల్లాలో వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ కారు రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పుట్టినరోజు వేడుకల సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం ఊహించని తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం సదరు కుటుంబ సభ్యులంతా కలిసి ఒక బంధువు పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. వేడుక ముగించుకుని మంగళవారం తెల్లవారుజామున ఎస్‌యూవీ వాహనంలో తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మైహార్ జిల్లా పరిధిలోకి రాగానే నియంత్రణ కోల్పోయిన వీరి వాహనం ముందర ఉన్న భారీ ట్రక్కును వెనుక వైపు నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మైహార్ జిల్లా పోలీసులు.. ప్రమాదానికి అతివేగమా లేక డ్రైవర్ నిద్రమత్తే కారణమా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu