Ad Code

మహిళపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక మహిళపై జరిగిన దాడి ఘటనను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. బాధితురాలికి న్యాయం చేయడంలో మరియు తప్పు చేసిన వారికి శిక్ష పడటంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని  స్పష్టం చేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించాలని చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో లోతైన విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదైంది, పోలీసులు అతడిని అరెస్టు కూడా చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న కార్యకర్తను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం. తప్పు చేసిన వారికి రాజకీయ అండదండలు ఉన్నా సరే… చట్టం ఎవరినీ వదిలిపెట్టదు. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది" అని హెచ్చరించారు. చట్టం ఎవరికీ లొంగదని, పక్షపాతం చూపదని, రాజకీయ పలుకుబడి ఉందనే కారణంతో ఏ ఒక్కరికీ రక్షణ లభించదని స్పష్టం చేసిన సీఎం.. రాష్ట్రంలో ప్రతి మహిళకు భద్రత ఉంటుందనే నమ్మకం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇలాంటి అరాచకాలను కూటమి ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని ఆయన తేల్చిచెప్పారు.రాజకీయ పరిచయాలు, పార్టీ అండదండలు తమను కాపాడతాయని ఎవరైనా భావిస్తే పొరబాటు పడినట్లే. ఈ ఘటనతో ప్రమేయమున్న సదరు నేతను పార్టీకి సంబంధించిన అన్ని అధికారిక పదవుల నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని నేను ఆదేశించాను. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దాడులకు తెగబడినా ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతాం అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu