Ad Code

ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా

రాన్‌లో ప్రస్తుతం ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా దేశాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా అమెరికా మిత్రపక్షం సౌదీ అరేబియా హాజరు కావడంతో సంచలనంగా మారింది. నిన్నమొన్నటి దాకా సౌదీ అరేబియా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరిగాయి. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ.. ఆశ్చర్యంగా శుక్రవారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరై ఆశ్చర్యపరిచారు. ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ అరేబియా ప్రతినిధిని పంపడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా-ఇరాన్ ఘర్షణల తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. సౌదీ అరేబియా ఉప విదేశాంగ మంత్రి టెహ్రాన్‌కు వెళ్లి ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడం కీలక దౌత్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రారంభంలో ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యే దేశాల జాబితాలో సౌదీ అరేబియా పేరు లేకపోవడం గమనార్హం. ఒమన్, ఖతార్ వంటి దేశాలు అమెరికా-ఇరాన్ చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో వాటి ప్రతినిధుల హాజరు ముందుగానే ఖరారైంది. అయితే చివరి నిమిషంలో సౌదీ ప్రతినిధి రావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Post a Comment

0 Comments

Close Menu