Ad Code

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

తెలంగాణలోని మేడ్చెల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ సమీపంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్‌, శిరీషగా గుర్తించారు. ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ సపంలోని ఘట్‌కేసర్‌- బీబీనగర్‌ రైల్వే మార్గంలో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నరు. విషయం తెలిసిన వెంటనే జీఆర్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దంపతుల మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. 

Post a Comment

0 Comments

Close Menu