Ad Code

అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని 'గీతం' యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. హైదరాబాద్‌లోని మైత్రీనగర్ కు చెందిన ఈ విద్యార్థిని వర్సిటీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. జూలై 22న కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె అందుబాటులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి కళాశాలకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం ఔటింగ్ కోసం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, విద్యార్థిని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Post a Comment

0 Comments

Close Menu