Ad Code

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. గుడిమల్లం ప్రాంతానికి చెందిన ఒక రైతు తన భార్య పేరు మీద మత్స్య ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రాయితీ అనుమతుల కోసం రెడ్డన్న రూ. 6 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. రైతు నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. అధికారుల రాకతో కార్యాలయం మొత్తం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతికి పాల్పడిన అధికారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu