Ad Code

ఢిల్లీలో 'పార్లమెంట్ మార్చ్' ఉద్రిక్తత : నిలిచిపోయిన ఫోన్ సిగ్నల్స్

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ ఇచ్చిన 'పార్లమెంట్ మార్చ్' పిలుపు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. దీంతో సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర రవాణా, కమ్యూనికేషన్ ఆటంకాలు ఏర్పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ నెట్‌వర్క్ సేవలపై తాత్కాలిక పరిమితులు విధించారు. పార్లమెంట్ పరిసరాల్లో ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోవడంతో పిలుపులు, ఇంటర్నెట్ సేవలు సరిగా పనిచేయక పౌరులు, విలేకరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనకారులు పార్లమెంట్ వైపు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తీవ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న పలువురు పార్లమెంట్ సభ్యులు, విఐపీలు మరియు సచివాలయ ఉద్యోగులు కూడా ఈ ట్రాఫిక్ చిక్కుల్లో పడి సమావేశాలకు ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్లమెంట్ పరిసరాల్లో అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు ఢిల్లీ పోలీసులను భారీగా మోహరించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పరిసర ప్రాంతాలలో కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu