Ad Code

హానర్ ఎక్స్ 7ఈ ప్లస్ 5జీ విడుదల

హానర్ ఎక్స్ 7ఈ ప్లస్ 5జీ ను అధికారికంగా విడుదల చేసింది. భారీ 8100mAh బ్యాటరీ, Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, అలాగే పలు AI ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఖతార్‌లో విడుదల కాగా, త్వరలో ఇతర మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Honor X7e Plus 5G ప్రస్తుతం ఖతార్ మార్కెట్‌లో విడుదలైంది. దీని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర QAR 999, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.26,000. ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన డెసర్ట్ గోల్డ్, వెల్వెట్ బ్లాక్, మీటియోర్ సిల్వర్రం గుల్లో లభిస్తుంది. 6.87-అంగుళాల TFT LCD HD+ డిస్‌ప్లే అందించారు. ఇది 1592 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. గరిష్టంగా 1020 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గించేందుకు Eye Comfort Mode కూడా అందుబాటులో ఉంది. Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ అందించారు. ఫోన్ Android 16 ఆధారిత MagicOS 10పై రన్ అవుతుంది.  ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు మరో సెకండరీ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 8100mAh భారీ బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణ. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో పలు ఆధునిక AI ఫీచర్లు కూడా ఉన్నాయి. AI Memory, Circle to Search, AI Eraser, AI Summary. ఈ ఫోన్‌కు IP68, IP69, IP69K వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు వున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu