Ad Code

జాతీయ సినీ అవార్డులు : ఉత్తమ సినిమాగా ఆర్టికల్ 370, ఉత్తమ బాలల చిత్రంగా 35- ఇది చిన్న కథ కాదు

2024 సంవత్సరానికిగానూ జాతీయ సినీ అవార్డులు ప్రకటించారు. ఇందులో ఉత్తమ సినిమాగా ఆర్టికల్ 370, ఉత్తమ నటిగా యామి గౌతమ్, ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ నిలిచారు.  '35- ఇది చిన్న కథ కాదు' చిత్రం హృదయాలను హత్తుకునే కథ, కుటుంబ విలువలు, పిల్లల భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. విడుదలైన సమయంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు జాతీయ అవార్డు గెలుచుకోవడం ద్వారా మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకుంది. కమర్షియల్ హంగులకు దూరంగా, జీవితానికి దగ్గరగా ఉండే కథతో రూపొందిన ఈ చిత్రం పిల్లలతో పాటు పెద్దలను కూడా భావోద్వేగానికి గురి చేసింది. '35- ఇది చిన్న కథ కాదు' చిత్రానికి నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కింది. చిన్నారి ప్రపంచాన్ని, విద్యా వ్యవస్థలోని ఒత్తిడిని, కుటుంబ అనుబంధాలను ఎంతో సహజంగా చూపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఒక సాధారణ కుటుంబం చుట్టూ తిరుగుతూ, పిల్లలపై తల్లిదండ్రులు పెట్టే అంచనాలు, వారి భావోద్వేగాలు, జీవిత పాఠాలను హృద్యంగా ఆవిష్కరించింది. ఈ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ, విశ్వదేవ్ రాచకొండ నటీనటులందరూ తమ పాత్రల్లో సహజంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా చిన్నారుల నటన సినిమాకు ప్రాణం పోసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎలాంటి అతిశయోక్తి లేకుండా, నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు సినిమాను ప్రతి కుటుంబానికి చేరువ చేశాయి. వాణిజ్యపరంగా కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా, ఓటీటీలో విడుదలైన తర్వాత మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, విద్యార్థులు ఈ సినిమాను ఆదరించారు.

Post a Comment

0 Comments

Close Menu