హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళా ప్రయాణికులు మస్కట్‌కు వెళ్లేందుకు నకిలీ వీసాలు ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి అరెస్టు చేశారు. ఈరోజు 20 మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ మహిళలను ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. మహిళల దగ్గర నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. దీంతో 20 మంది మహిళా ప్రయాణికులను ఔట్‌పోస్టు పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ వీసాలు ఎక్కడినుంచి తీసుకువచ్చారు, ఎవరు ఇచ్చారు అనేదానిపై ఆరా తీస్తున్నారు.
0 Comments