'మిషన్ ఆగమన్' ప్రయోగానికి చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన దేశీయ తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం తాత్కాలికంగా వాయిదా పడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11:30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. అయితే, కౌంట్‌డౌన్ ముగిసే సమయానికి రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు నిపుణులు గుర్తించారు. చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగానికి లైన్ క్లియర్ అయింది. రాకెట్‌లో ఏర్పడిన లోపాన్ని స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా సరిదిద్దారు. లోపాన్ని అధిగమించిన వెంటనే శాస్త్రవేత్తలు మళ్లీ కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.
0 Comments