Ad Code

1600 నంబర్‌ సిరీస్‌ నుంచి వచ్చే కాల్స్‌ని ఏ యాప్‌ కూడా బ్లాక్‌ చేయకూడదు : ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ

నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్‌ సిరీస్‌ నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ని ఏ యాప్‌ కూడా బ్లాక్‌ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పష్టం చేసింది. అలాగే 140 నంబర్‌ సిరీస్‌తో వచ్చే ప్రమోషనల్‌ కాల్స్‌ని తమ నిర్వహణలోని డీఎన్‌డీ రిజిస్ట్రీ తప్ప ఇతరత్రా ఏ యాప్‌ కూడా బ్లాక్‌ చేయడానికి లేదని వివరణ ఇచ్చింది. నిర్దిష్ట సిరీస్‌ల నుంచి వచ్చే కాల్స్‌ని ట్రూకాలర్‌ యాప్‌ స్పామ్‌ కింద లేబులింగ్‌ చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, 1600, 140 నంబర్‌ సిరీస్‌లు దుర్వినియోగమవుతున్నాయంటూ 5.25 లక్షల మంది పైగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ట్యాగ్‌ చేయడం తప్పెలా అవుతుందని ట్రూకాలర్‌ సీఈవో రిషిత్‌ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ రెండు సిరీస్‌లలో రోజూ 5.1 కోట్లకు పైగా కాల్స్‌కి యూజర్లు అసలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రూకాలర్‌ యూజర్లు ప్రతి రోజూ 140 సిరీస్‌ నుంచి వచ్చే 4 లక్షల కాల్స్‌ని, 1600 సిరీస్‌కి చెందిన 1.25 లక్షల కాల్స్‌ని బ్లాక్‌ చేస్తున్నట్లు వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu