Ad Code

మైసాక్ తుఫాన్ ధాటికి అతలాకుతలమైన గ్వాంగ్జీ : భారీ వరదల కారణంగా 15 మంది మృతి

చైనాలో మైసాక్ తుఫాన్ సృష్టించింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీప్రాంతం ఈ తుఫాన్ ధాటికి పూర్తిగా అతలాకుతలమైంది. మైసాక్ తుఫాన్ కారణంగా కుండపోతగా వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.రికార్డు స్థాయిలో దాదాపు 74.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా 15 మంది మృతి చెందారు. ప్రాంతీయ రాజధాని నాన్నింగ్ సహా గ్వాంగ్జీ ప్రాంతంలోని అనేక నగరాల్లో వీధులు నదులను తలపిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు భయాందోళన కలిగిస్తున్నాయి. హెంగ్‌జౌ పరిధిలోని 'లీలాన్', 'యున్‌బియావో' లాంటి రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడమే కాకుండా ఒక ఆనకట్ట గోడ దెబ్బతినడంతో దిగువన ఉన్న గ్రామాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. . దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.వరద నీరు ఇళ్లపైకి చేరడంతో బిల్డింగ్‌ల పైన చిక్కుకుపోయిన బాధితులను రక్షించడానికి మరియు వారికి ఆహారం అందించడానికి రెస్క్యూ టీమ్స్ అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu