ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన భారీ నెమలికోన చేప సందడి చేసింది. సముద్రంలో వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారుల వలకు సుమారు 100 కిలోల బరువున్న నెమలికోన చేప చిక్కడంతో హార్బర్‌లో సందడి నెలకొంది. భారీ పరిమాణంలో లభించిన ఈ చేపను చూసేందుకు స్థానికులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హార్బర్‌లో నిర్వహించిన వేలంలో ఈ అరుదైన చేపను స్థానిక వ్యాపారి రూ.15 వేలకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు తెలిపారు. నెమలికోన చేప సముద్ర జలాల్లో అరుదుగా కనిపించే జాతికి చెందినదిగా మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా లోతైన సముద్ర ప్రాంతాల్లో సంచరించే ఈ చేపలు అప్పుడప్పుడే వేట వల లకు చిక్కుతుంటాయి.
0 Comments