Ad Code

ఇష్క్ కరో పార్టీ పెట్టిన రిటైర్డ్ జడ్జి మార్కండేయ కట్జూ : ఎంపీ మహువా మొయిత్రాకు ఆహ్వానం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సోషల్ మీడియా సెలబ్రిటీ జస్టిస్ మార్కండేయ కట్జూ ఇష్క్ కరో పార్టీ ని లాంచ్ చేశారు. పేరు వినగానే ఇదేదో ప్రేమికుల రోజు కోసం, పార్కుల్లో తిరిగే లవర్స్ కోసం పెట్టిన రోమియో పార్టీ అనుకుంటే మీకు టోటల్ మిస్ కాన్సెప్షన్ ఉన్నట్లేనని ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. దేశంలోని పేదరికం, నిరుద్యోగాన్ని పోగొట్టడానికి ప్రజల మధ్య ఇష్క్ పెంచడమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమట!. అయితే, పార్టీ పెట్టడం వరకు ఒక ఎత్తు అయితే ఈ ఇష్క్ కరో బండిని లాగడానికి ఆయన ఎంచుకున్న పిల్లర్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భారతదేశంలో ఉద్దండులైన నేతలు, సీనియర్ పొలిటీషియన్లు ఎందరో ఉండగా, కట్జూ నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ మహువా మొయిత్రాకు రూట్ క్లియర్ చేశారు. మహువా ! ఆ కాక్రోచ్ పార్టీ జోకర్లను వదిలేయ్, మన ఇష్క్ కరో పార్టీ లో చేరిపో.. మన అజెండా మేక్ లవ్, నాట్ వార్ అంటూ ఎక్స్ వేదికగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. అటు పార్లమెంట్‌లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే మహువా మొయిత్రా.. కట్జూ ప్రేమ సదస్సులో చేరితే ఎలా ఉంటుందా అని నెటిజన్లు అప్పుడే మీమ్స్ పండించడం మొదలుపెట్టారు.

Post a Comment

0 Comments

Close Menu