Ad Code

హైదరాబాద్‌లో భారీ వర్షం : రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీరు

హైదరాబాద్‌ని భారీ వర్షం కురుస్తోంది.కూకట్‌పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, చందానగర్, సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ భారీ వర్షంతో తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా సైబారాబాద్‌లో కుండపోత వర్షం ముంచేస్తోంది. ఈ సంవత్సరం ఇంత భారీ వర్షం ఎప్పుడూ రాలేదు. ఇంతలా వర్షం పడుతుందని ఎవరూ అనుకోలేదు కూడా. అయితే వాతావరణ అధికారులు ముందే చెప్పారు. భారీ వర్షం పడబోతోందని చెప్పారు. అలాగే పడుతోంది. ఈ వర్షం వల్ల గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సరిగ్గా ఉద్యోగులు, వృత్తి పనివారు.. సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో.. ఈ వర్షం 5 గంటలకు మొదలై.. కుమ్మిపడేసింది. సాయంత్రం కాస్తా.. రాత్రి 7 గంటల్లా చీకటిగా మారిపోయింది. ఈ వర్షం ఉరుములు, మెరుపులతో వచ్చింది. దట్టమైన మేఘాలు.. భారీగా వర్షించడం వల్ల రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. వాహనదారులు చాలా నెమ్మదిగా డ్రైవ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ వర్షానికి తోడు ఈదురుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. సికింద్రాబాద్‌లో ఈదురుగాలులను చూసి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇంత వేగంగా గాలి ఎందుకు వస్తోంది అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. ఈ సంవత్సరం ఇంతలా ఈదురుగాలులతో భారీ వర్షం రాలేదు. ఇవాళ ఉదయం నుంచి మేఘాలు ఉన్నా పెద్దగా వాన లేదు. కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఈ పరిస్థితి వచ్చేసింది. ఈదురుగాలుల వల్ల వాహనదారులకు కొత్త సమస్యలు వస్తున్నాయి. వారు గొడుగుల వాడినా ఉపయోగం ఉండట్లేదు. వాన.. అడ్డుగా వస్తోంది. అడ్డంగా పడుతోంది. దాని వల్ల ఎటూ తప్పించుకునే పరిస్థితి లేదు. రోడ్డెక్కిన ప్రతీ ఒక్కరూ తడిసిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారు.. ఎప్పటికి ఇంటికి చేరుతామో అని టెన్షన్ పడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu