Ad Code

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా చిన్నారులు : యూపీఐ ద్వారా వేల లావాదేవీలు : విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సీపీ వెల్లడి

హైదరాబాద్‌ లో ఇటీవల ఫోన్‌ హ్యాకింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ ప్రత్యేక బృందం విచారణ చేపట్టగా షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి. కొన్ని కేసుల్లో ఫోన్లు సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేయలేదు. పిల్లలు గేమ్స్‌ ఆడటం వల్లే ఖాతాల్లోని డబ్బులు డెబిట్‌ అయ్యాయని గుర్తించారు. ఆన్‌లైన్‌లో ఆటలకు బానిసలుగా మారిన చిన్నారులు అందులో ఉన్న యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపి గేమ్స్‌ ఆడుతున్నారు. 'ఫ్రీ ఫైర్‌', 'ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌' వంటి ఆన్‌లైన్‌ మల్టీప్లేయర్‌ గేమ్స్‌కు అలవాటుపడి ఆ ఊబిలో చిక్కుకుంటున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ సజ్జనార్‌ పలు సూచనలు చేస్తూ దిశా నిర్దేశం చేశారు. హ్యాకింగ్‌, మోసపూరిత లింకులు లేవని, పిల్లలే 'ఫ్రీఫైర్‌', 'ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌' వంటి ఆన్‌లైన్‌ మల్టీప్లేయర్‌ ఆటల్లో వర్చువల్‌ కాయిన్స్‌, డైమండ్స్‌ కొనుగోలు చేయడానికి ఫోన్‌లో సేవ్‌ చేసిన కార్డ్స్‌, యూపీఐలను వినియోగించారని తేలింది. ముఖ్యంగా.. పెద్దవాళ్లు, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు పిల్లలతో సరైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారని సజ్జనార్‌ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu