ఏథర్ ఎనర్జీ తన స్కూటర్లకు ‘వాయిస్ ఆన్ ఏథర్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా రైడర్లు తమ చేతులను ఉపయోగించకుండా కేవలం మాట్లాడటం ద్వారా వివిధ పనులను చేయవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఈ స్కూటర్లు రైడర్లతో సంభాషించి, ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి. ఈ ఫీచర్ ఏథర్ జెన్ 3, కొత్త మోడళ్లలో అందుబాటులో ఉంది. ఏథర్ 450X, 450 అపెక్స్, రిజ్టా Z రైడర్లు ఇప్పుడు బ్లూటూత్ హెడ్‌సెట్ లేదా హాలో స్మార్ట్ హెల్మెట్ ద్వారా స్కూటర్‌కు వాయిస్ కమాండ్‌లు ఇవ్వగలరు. రైడర్లు కేవలం మాట్లాడటం ద్వారా నావిగేషన్‌ను ప్రారంభించడం. ఒక ప్రదేశం గురించిన సమాచారం కోసం వెతకడం, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటివి చేయగలరు. ఈ కొత్త ఫీచర్ కేవలం నావిగేట్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు. రైడర్లు వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయవచ్చు. మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే స్కూటర్ వివిధ సెట్టింగ్‌లను మార్చవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేషన్ లెవెల్స్ వంటి ఫీచర్లను కూడా వారి వాయిస్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ సిస్టమ్ ఎల్ఎల్ఎం, సహజ భాషా ప్రాసెసింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉందని ఏథర్ చెబుతోంది. భవిష్యత్తులో దీనిని మరింత మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. భవిష్యత్తులో ఈ స్కూటర్ రైడర్‌తో ఆటోమేటిక్‌గా సంభాషిస్తూ, మార్గాలు, బ్యాటరీ లైఫ్, భద్రత, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించి సమాచారం, సూచనలు, హెచ్చరికలను అందిస్తుంది. ఇది రైడింగ్ అనుభవాన్ని మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా, సురక్షితంగా చేస్తుంది.
0 Comments