Ad Code

ఏపీపీఈసెట్ ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్ లో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో (బీపీఈడీ, డీపీఈడీ) ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీఈసెట్ ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా పేర్కొనే ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు. దీంతో పాటు ఫలితాలను ఎలా తెలుసుకోవచ్చనే దానిపైనా వివరాలు వెల్లడించారు. శారీరక విద్య, క్రీడల రంగంలో కెరీర్ దిశగా తదుపరి అడుగు వేసిన విజయవంతమైన అభ్యర్థులందరికీ అభినందనలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ఏడాదికి పరీక్ష రాసిన వారిలో 89.76 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నమోదు చేసుకున్నవారు 4,037 కాగా, ఇందులో పరీక్షకు హాజరైనవారు 2,958. అలాగే అర్హత సాధించినవారు 2,655. అర్హత సాధించిన పురుషులు 1,993 (92.91%) కాగా, అర్హత సాధించిన మహిళలు 662 (81.43%) మంది ఉన్నారు. అభ్యర్థులందరికీ వారి భవిష్యత్ విద్యా, వృత్తిపరమైన ప్రయాణంలో విజయం లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ఏపీపీసెట్ ఫలితాలను అభ్యర్ధులు తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PECET/ ను అందుబాటులో ఉంచారు. అలాగే ర్యాంక్ కార్డుల కోసం https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx లింక్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా వివరాలు పొందవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu