కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి పట్టణంలో మొబైల్ గేమ్స్‌కు పూర్తిగా బానిసైన 16 ఏళ్ల బాలుడు కన్నప్రేమను, రక్తాన్ని సైతం మరిచి సైకోలా ప్రవర్తించాడు. అర్థరాత్రి వేళ కూడా నిద్రపోకుండా మొబైల్‌లో గేమ్ ఆడుతుండటంతో, తల్లిదండ్రులు మందలించి గేమ్‌లు ఆడొద్దని వారించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన ఆ మైనర్ బాలుడు ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని కన్నతల్లి, తండ్రి, అక్కపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆపై తానేం చేస్తున్నాడో తెలియని మైకంలో, తన గొంతును కూడా కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కత్తిపోట్లకు గురైన తండ్రి వెంకట నాయుడు (48), అక్క ప్రగతి (20) తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన తల్లి సౌజన్యతో పాటు, గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన నిందితుడైన కొడుకును స్థానికులు, పోలీసులు కలిసి తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments