బీజేపీకి అన్నామలై రాజీనామా : ఆమోదించిన బీజేపీ అధిష్టానం


మిళనాడు బీజేపీ నేతఅన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం. పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్‌ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల్లో  అన్నామలై గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్‌ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత సివిల్స్‌లో ర్యాంక్‌ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org