Ad Code

ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి : మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పారు. అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సవిత తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, గుమ్మనూరు జయరాం, ఉమ్మడి అనంతపురం జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు నగేష్ హాజరయ్యారు. జిల్లా బెస్త సేవా సంఘం అధ్యక్షుడిగా చేపలహరి, కార్యదర్శిగా బెస్త భాస్కర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ బెస్తల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. చేపల వేట నిషేధం లో ప్రతి మత్స్యకారుడికి రూ. 20 వేలు అందించేలా ఎన్నికల హామీని నెరవేర్చామన్నారు. కులవృత్తి చేసుకోవడానికి రాయితీపై పరికరాలు అందిస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్ర మొదటి స్థానంలో ఉందన్నారు. ఎడారిగా ఉన్న రాయలసీమను సస్యశ్యామలం చేసిన భగీరథుడు చంద్రబాబు అని అన్నారు.. రాయలసీమలోనూ ఆక్వా కల్చర్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని నిరూపించగలుగుతున్నామన్నారు.

Post a Comment

0 Comments

Close Menu